గర్భం ధరించినప్పుడు లైట్ మేకప్ హుందాగా ఉంటుంది. పలుచని కాటుక రేఖ, లైట్ ఫౌండేషన్ ఆకర్షణీయంగా ఉంటుందట. ఇంట్లో వాడకానికి మేక్సీ లేదా గౌను చాలా సుఖంగా ఉంటుందట. అలాగే పెరిగిన శరీరాన్ని కాటన్ శారీ బాగా కప్పుతుందట. అలాగే బ్లౌజ్ లూజ్‌గా ఉంటేనే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
హై హీల్స్ శాండిల్ అస్సలు వేసుకోకూడదట. ఫ్లాట్ శాండిల్స్ చెప్పులు మంచివట. సింథెటిక్, పాలియస్టర్, నైలాన్ వస్త్రాలకు దూరంగా ఉండాలట. ఇవి చర్మానికి మంచివి కావట. ఈ వస్త్రాలు దురదలకు కారణం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. వంటింట్లో పనిచేసేటప్పుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలట. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పైకెక్కి అస్సలు పనిచేయకూడదు. మెట్లు ఎక్కిదిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపడకూడదట.