పచ్చ కర్పూరంతో ధనాదాయం.. ఆ దిశలో వుంచితే? (Video)

సోమవారం, 22 జూన్ 2020 (19:42 IST)
Pacha karpooram
పచ్చకర్పూరంతో ధనాదాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఓ పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని ఉంచి.. మూటలా కట్టుకుని కుబేర దిశలో వుంచాలి. రోజూ నిష్ఠతో పచ్చ కర్పూరాన్ని వుంచిన పసుపు వస్త్రానికి ధూపదీపాలను వేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 
 
పచ్చ కర్పూరం వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలే. ఇంకా చిన్నపాటి పచ్చ కర్పూరం ముక్కను నీటిలో వేసి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో వుంచడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
పచ్చ కర్పూరానికి సంపదను ఆకర్షించే శక్తి వుంది. తద్వారా ప్రతికూలతలుండవు. వ్యాపారంలో రాణించాలంటే.. పచ్చ కర్పూరాన్ని.. డబ్బులు వుంచే పెట్టెలో వుంచడం మంచిది. ఇంట్లో దుష్ట శక్తులను తొలగించాలంటే.. పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో వుంచడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
పచ్చ కర్పూరం వున్న చోట శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువై వుంటుందని విశ్వాసం. అందుకే పచ్చ కర్పూరాన్ని పూజగదిలో వుంచే వారికి సకల సంపదలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈతిబాధలు వుండవు అని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు