శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

సెల్వి

సోమవారం, 28 జులై 2025 (10:08 IST)
Lord Shiva
శ్రావణ సోమవారం..  జులై 28న తొలి శ్రావణ సోమవారంను జరుపుకుంటున్నాం శ్రావణ మాసంలో శివుడి గురించి అభిషేకాలు చేస్తారు. ఈ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు, హోమాలు ఇతర మాసాల్లో కూడా వెయ్యిరెట్లు శుభయోగాలను ఇస్తాయి. 
 
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలాలు, అన్నం మొదలైన వాటితో అభిషేకం చేస్తే జీవితంలో శుభాలు చేకూరుతాయి. సోమవారం రోజున శివుడికి బిల్వపత్రిని ఎవరైతే అర్పిస్తారో.. వారి పాపాలు అన్ని పటా పంచలైపోతాయి. శివుడికి బెల్లంను నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం వుంటుంది. 
 
ఆరోజున శివుడి కోసం ప్రత్యేకంగా ఇష్టమై తెల్లని పూలతో అభిషేకం చేయాలి.  భస్మం కూడా అర్పించాలి. అంతే కాకుండా.. శివుడి కోసం ఉపవాసం చేసినవారికి జీవితంలో ఉన్న కష్టాలు అన్ని దూరమౌతాయి. శివాలయంలో నెయ్యితో బిల్వపత్రం చెట్టు కింద దీపాల్నివెలిగించాలి. 
 
కార్తీక సోమవారాలు ఎలా చేస్తామో అలానే శ్రావణ సోమవారాలు చేయడం మంచిది. అలాగే ప్రదోష కాలంలో శివాలయంకు వెళ్లి, స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు