కోరంకి జబ్బుతో కోటి మంది చస్తారు, మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది

మంగళవారం, 10 మార్చి 2020 (19:26 IST)
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పిన వాక్కులు ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి. కోరంకి(కరోనా అని అంతా అనుకుంటున్నారు) జబ్బుతో కోటి మంది చస్తారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఇంకా మరికొన్ని జరుగుతాయంటూ ఆయన చెప్పినవి.
 
* రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
* సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
* విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది.
* గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది.
* సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
* నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
* విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
* ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.
* కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు.
* ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
* 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
* ఈశాన్యం వైపు కోరంకి జబ్బుతో కోటి మంది చస్తారు.
* నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
* 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
* మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
* పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
* అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
* మహానంది మరుగున మహిమలు పుడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు