తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగంలోనూ, వృత్తిపరంగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తులా లగ్నంలో జన్మించిన జాతకులు బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేంత వరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఏ కార్యాన్నైనా ఆత్మ విశ్వాసం, పట్టుదలతో పూర్తి చేస్తారు.
ఇతరులు చేసే ఎంతటి కష్టమైన పనినైనా కంటితో చూసి చేత్తో చేసేస్తారు. ఇతరుల పట్ల గౌరవభావంతో ప్రవర్తిస్తారు. జీవితంలో ఐశ్వర్యవంతులుగా సుఖసంతోషాలతో జీవిస్తారు. భూములు, వాహనాలు కొనడంలో ఆసక్తి చూపుతారు. జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కొంటారు. బంధువులు, స్నేహితుల వద్ద స్నేహభావంతో ప్రవర్తిస్తారు.