కార్తీకంలో తులసీ వివాహం జరిపిస్తే.. అన్నీ శుభాలే తెలుసా?

శనివారం, 19 నవంబరు 2022 (17:11 IST)
కార్తీక బహుళ ఏకాదశి, ద్వాదశి తిథులతో తులసీ వివాహం చేయడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం ద్వాదశి తిథి నాడు రోజున తులసిని శ్రీ మహా విష్ణువు శాలిగ్రామంతో వివాహం చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. 
 
తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. 
తులసి మొక్కను నిత్యం పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
తులసీ మొక్కను కార్తీకంలో పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. 
తులసీ వివాహం చేయదలిచితే.. సాయంత్రం పూట పూజను ఆరంభించాలి. 
తులసి చెట్టు ఎదుట నీటితో నింపిన పాత్రను వుంచి నెయ్యి దీపం వెలిగించాలి. 
తులసికి చందనం, తిలకం రాయాలి. 
తులసి చెట్టుకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి 
ఆపై తులసి చెట్టుకు ప్రదక్షణలు చేసి.. హారతి ఇవ్వాలి. 
తప్పకుండా తులసీ వివాహం సందర్భంగా ఉపవాసం వుండాలి. 
తులసి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని విశ్వాసం. 
తులసీ పూజతో వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
తులసీ వివాహంతో విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు