ముక్కోటి రోజు భక్తులంతా తప్పకుండా ఉపవాసం ఉంటారు. శక్తి కొలదీ భజనలు, భక్తి పాటలు, విష్ణు సహస్ర నామ పారాయణలు ఇలా అనేక స్తోత్రాలు పఠిస్తారు. ఇంత ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఒకసారే వస్తుంది కాని 2025లో మాత్రం రెండు సార్లు రానుంది.
దీనికి కారణం 2024 లీపు సంవత్సరం కావడం, తిథుల్లో తగులు, మిగులు రావడం వల్ల ఏటా డిసెంబర్‌లో రావాల్సిన ముక్కోటి 2025లో మాత్రం జనవరి 10వ తేదీన వస్తోంది. ఇదే ఏడాది చివర్లో డిసెంబర్ 30వ తేదీన మరో ముక్కోటి ఏకాదశి రానుంది. ఇలా ఒకే సంవత్సరంలో రెండు సార్లు వైకుంఠ ఏకాదశిలు రానున్నాయి.