శ్రీహరిని, తులసిని బుధవారం పూజ చేయడం ద్వారా..?

శుక్రవారం, 5 మార్చి 2021 (05:00 IST)
శ్రీ మహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పూట, పరమేశ్వరుని ఆలయానికి కూడా సాయంత్రం పూట వెళ్ళటం మంచిది. అలాగే బుధవారం ఆయనను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహా విష్ణువు స్థితి కారకుడు. కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. అలాగే మహేశ్వరుడు లయకారకుడు కాబట్టి రోజు పూర్తవుతున్న సమయంలో ఆయనను అంటే సాయంత్రం పూట దర్శించుకుంటే రెట్టింపు ఫలాన్ని పొందవచ్చు. 
 
అలాగే బుధవారం రోజు తులసీ పూజ విశేష ఫలితాలను అందిస్తుంది. తులసిని ఉదయం ఏమీ తీసుకోకుండా స్వీకరించడం మంచిది. ఉదయం పూట తులసీ పూజ చేయడం, తులసీ రసాన్ని మంచినీటితో కలిపి తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, బలం, ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతగానో తోడ్పడుతుంది. మట్టిపాత్రలో నీటిని వుంచి అందులో తులసీ ఆకులను నాలుగేసి వేసి తాగడం ఆరోగ్యకరమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు