22-09-2019 నుంచి 28-09-2019 వరకు మీ రాశి ఫలితాలు..

శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:19 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. పరిచయంలేని వారితో జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలతలున్నాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనయోగం. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు, జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శనివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. స్థిరాస్తి కొనుగోలులో పునరాలోచన మంచిది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. జూదాల జోలికి పోవద్దు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ఆలోచనలు నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గృహంలో సందడి నెలకొంటుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కష్టం ఫలిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అనవసర జోక్యం తగదు. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
సంప్రదింపులు ఫలించవు. రుణ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా వుండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబీకులు ఆ అశక్తతను అర్థం చేసుకుంటారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడుతాయి. గురువారం నాడు ఓర్పుతో శ్రమించిన గాని పనులు సాగవు. సహాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పొదుపు ధనం గ్రహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
శుభవార్త వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శని, ఆదివారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. కనిపించకుండా పోయినా పత్రాలు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు మందకొడిగా సాగుతాయి. మంగళవారం నాడు ఏ విషయంపై ఆసక్తి వుండదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ వారం కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. కొన్ని సమస్యలు నుంచి బయటపడతారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో స్పర్థలు తెలత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. సంతానం చదువులపై దృష్టి సారించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉద్యోగస్తులకు ఆనుకూలదాయకం. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఓర్పుతో వ్యవహరించండి. పట్టుదలకు పోవద్దు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితుల సాయం అందుతుంది. బుధ, గురువారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్టం 3, 4, పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గృహమార్పు ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వాహనచోదకులకు చికాకులు అధికం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారనుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల ప్రారంబంలో ఆటంకాలెదరువుతాయి. శుక్ర, శనివారాల్లో శకునాలను పట్టించుకోవద్దు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. గృహ మార్పు కలిసివస్తుంది. బంధువులతో  సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలలో తీరిక ఉండదు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ప్రయాణంలో జాగ్రత్త. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు