పసుపు, కుంకుమలు చేయి నుంచి కింద జారిపడితే కంగారు పడతాం. ఇదేదో అశుభసూచకమని భయపడుతుంటాం. అయితే పసుపు, కుంకుమ చేయి జారి కిందపడితే.. అది భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు జారిపడినా.. అది నేలపాలవుతుంది. అదేవిధంగానే పసుపు.. కుంకుమ కూడాను. పసుపు, కుంకుమ చేజారిపడితే.. అశుభసూచకమని ఏ శాస్త్రం చెప్పలేదు.
నేలపైన పసుపు, కుంకుమలు పడితే అరిష్టం కాదు. ఎందుకంటే.. విజయవాడ, తిరుమలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు.. పసుపు, కుంకుమలతో మెట్ల పూజ చేస్తుంటారు. అది పుణ్యకార్యంగానే భావిస్తుంటాం. అదే తరహాలోనే పసుపు, కుంకుమ చేజారినా భూదేవికి అర్పించినట్లు భావించాలి.