''నమస్తులసి కళ్యాణీ, నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి, నమస్తే మంగళప్రదే
రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ శ్లోకాన్ని పఠింటి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోయాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.
ఉదయం, సాయంత్రము తులసి వద్ద చేసే దీపారాధన సౌభాగ్యాన్ని ఇవ్వటమే గాక ఇంటిలోకి దుష్టశక్తులు రాకుండా చేస్తుంది. తులసి మొక్క క్షీర సాగరమధనంలో కామధేనువు, కల్పతరువులు, అమృతంతో బాటు ఉద్భవించిందని పద్మ పురాణంలో ఉంది.