కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెంపొందాలంటే., కుటుంబ సభ్యులంతా కలిసి రోజులో ఒక పూటైనా భోజనం చేసే అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అంతా కూర్చున్నప్పుడు చేసి ఒకరి భావాలు మరొకరు పంచుకోండి.
సంవత్సరానికి ఒకసారైనా పిక్‌నిక్, పర్యటనలకు వెళ్తుండాలి. ప్రయాణాల్లో పిల్లల సరదాలకు, ఆలోచనలకు ఎక్కువగా విలువ ఇవ్వాలి. పుట్టిన రోజులకు, మ్యారేజీ యానివర్సరీకు శుభాకాంక్షలు చెప్పి వారి మనసుకు నచ్చే బహుమతులిచ్చి మీ ప్రేమను తెలియపరచండి.
మనసులో ప్రేమ వుంటే చాలదు. దాన్ని వెలిబుచ్చితేనే దాని విలువ పెరుగుతుంది. ఒకరి పనిలో ఒకరు సహాయ సహకారాలు అందించుకోండి. అది మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది.