సమయం కల్పించుకోవడానికి మేలైన పద్ధతి ప్రతి పనికీ ఓ సమయం కేటాయించడం. వేచి వుండేందుకు వృధా చేసే సమయం ఎంతో విలువైనది. పనులు తిరిగి వచ్చినా సమయం మాత్రం తిరిగిరాదు.
మనకంటూ ఓ సమయం కేటాయించుకోవడంవల్ల ఆ సమయంలో మనం ఎక్కువ ఆనందం పొందగలుగుతాం. ఈ సమయంలో మనకు వేరే పనులు వుండవు. అన్న భావన సంతోషం కలిగిస్తుంది. ఆ భావనే విశ్రాంతినిస్తుంది.
మనకు, మనసుకు ఆనందం కలిగించే పనులు ఉదయం, రాత్రి, ప్రత్యేక సమయాలు కేటాయించుకుని నిర్వహించుకుంటే వానికి ఆటంకం కలగదు. ఆసక్తి కలిగిన అంశాలనే ఎంచుకుని, మనసుపడి పని చేయడం ద్వారా అలసట, ఒత్తిడి దరికి చేరవు.