రిలాక్స్... మీ నైపుణ్యానికి ఓ టానిక్

WD
దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. చేసే పనిలో నైపుణ్యం పెరిగి హుషారుగా ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలైనా ఏదైనా శారీరక వ్యాయామానికి చోటిస్తే టెన్షన్ తగ్గి శక్తి పెరుగుతుంది.

ఆరు బయటకు వెళ్లి తాజా శ్వాస పీల్చుకుంటే ఓ కప్పు కాఫీ ఇచ్చే రిలాక్సేషన్ కంటే ఎక్కువ హాయిగా ఉంటుంది. ఎన్ని పనులున్నా, ఎంత హడావిడిగా ఉన్నా ఉదయం పూట అల్పాహారం మానవద్దు.

ప్రతి అరగంటకోసారి రోజంతా కొద్దికొద్దిగా నీటిని తాగుతుంటే చురుగ్గా, హుషారుగా ఉంటారు. ఒత్తిడి కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఆలోచనలతో శక్తిని వృధా చేసుకునేకంటే, హాయిగా మనసారా నవ్వేందుకు దోహదపడే అంశాలపై దృష్టి సారించండి.

అదేవిధంగా చాలినంత నిద్రపోకపోయినా ఆ ప్రభావం శారీరకంగానే కాక, మానసికంగానూ ఉంటుంది. మంచి ఆహారం, చాలినంత నిద్ర, చక్కని వ్యాయామం, సంతోషంగా ఉండటమనేవి మీ పనిలోని నైపుణ్యాన్ని పెంచుతాయి.

వెబ్దునియా పై చదవండి