బలహీనత గురించి ఆలోచిస్తే...

సోమవారం, 25 జూన్ 2018 (13:12 IST)
మీరు దేనిని గురించి ఆలోచిస్తే అదేవిధంగా తయారవుతారు. బలహీనతను గురించి ఆలోచిస్తే బలహీనులుగా తయారవుతారు. బలాన్ని గురించి ఆలోచిస్తే బలవంతులుగా తయారవుతారు. కానీ బలాన్ని గురించి ఆలోచించాలంటే అందుకు తగినవిధంగా నిరంతరం మనకు బలాన్ని గుర్తుచేస్తూ ఆ బలానికి చిహ్నమైన ఒక ఆదర్శం మనకు అవసరం.
 
ఒక ఆదర్శాన్ని ఎదురుగా ఉంచుకుని దానిని అనుసరించేటపుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువగానే ఉంటుంది. ఆ ఆదర్శం మనకు అందనంత ఎత్తులో చేరుకోలేనంత దూరంలో ఉండవచ్చును. కానీ దానిని తప్పక పొంది తీరాలని మనం అనుకోవాలి. నిజానికి మనం ఎంచుకునేది ఆదర్శమయుండాలి. అటువంటి ఆదర్శాన్ని మాత్రమే వ్యక్తుల సమాజం తమ ముందుగా ఉంచుకోవాలి. 
 
దురదృష్టవశాత్తు అధిక శాతం మంది మనుష్యులు తమ తమ జీవితాల్లో అసలు ఎటువంటి ఆదర్శాన్ని ఏర్పరచుకోకుండా చీకటిలో తడుముకుంటూ జీవితమంతా గడుపుతుంటారు. జీవితంలో ఏదో ఒక ఆదర్శాన్ని తన ముందు ఉంచుకుని దానిని సాధించాలని ఆరాటపడే వ్యక్తి, తపనపడే వ్యక్తి, వెయ్యి తప్పులు చేస్తే అస్సలు ఆదర్శమే లేకుండా జీవితాన్ని గడిపే వ్యక్తి యాభైవేల తప్పులు చేస్తారు. కాబట్టి ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉండటమే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు