మీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉందా.. ?

FILE
మీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉందా.. నలుగురిలో హుందాగా మీరు డ్రెస్ చేస్తున్నారా.. ఒకవేళ మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే.. డ్రెస్ చేయడంలో కన్‌ఫ్యూజన్ ఉంటే ఈ కథనం చదవాల్సిందే. నలుగురు మనల్ని చూసేటప్పుడు ఇతరులకు మనపై మంచి అభిప్రాయం కలిగేలా దుస్తులు ధరించాలి. దీన్నే డ్రెస్సింగ్ సెన్స్ అంటారు. జనరల్ నాలెడ్జ్‌ను ఎలా పెంపొందించుకుంటున్నామో అదేవిధంగా డ్రెస్సింగ్ సెన్స్‌ కూడా క్రమేణా మెరుగవుతూ వుండాలి.

డ్రెస్సింగ్ సెన్స్ అనేది.. మనం ధరించే దుస్తులు, మ్యాచింగ్, దుస్తులను ధరించే విధానం, కలర్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకా శరీర ఎత్తు, బరువుకు తగ్గట్లు దుస్తులు ధరించాలి. అలాగే రంగులు కూడా మీ కలర్‌కు తగ్గట్లు ఎంచుకోవాలి. స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుంది. ఫిట్ అంటేనే బిగుతుగా డ్రెస్‌లు వేయకుండా కాస్త లూజుగా మీ శరీరాకృతికి తగ్గట్టు వాడటం మంచిది.

మీరు ధరించే దుస్తులు మీ మనస్సుకు మాత్రమే నచ్చితే సరిపోదు. ఇతరులకు కూడా అది నచ్చేలా ఉండాలి. మీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఇతరుల వద్ద అభిప్రాయాలు తీసుకుంటూ వుండాలి. వారంలో ఒకేలాంటి డ్రెస్‌లు కాకుండా రోజు మార్చి రోజు విభిన్న రంగుల్లో నీట్‌గా డ్రెస్ చేస్తే మీరే ఎక్స్‌పర్ట్‌లు అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వెబ్దునియా పై చదవండి