రోజువారీ పనుల్లో సంతోషాన్ని వెతుక్కోవడం సాధ్యపడుతుందా?

FILE
రోజువారీ పనుల్లో సంతోషాన్ని వెతుక్కోవడం కచ్చితంగా సాధ్యపడుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలామంది దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేకానేక విషయాలనుంచి ఆనందాన్ని వెతుక్కోలేకపోతుంటారు. పనుల్ని యాంత్రికంగా ముగించడమే ఇందుకు కారణం. అనుకూల ఆలోచనల్ని ఇంట్లో పిల్లలతో, భర్తతో పంచుకోవాలి. మనస్సులో కదలాడే భావాల్ని చెప్పడం వల్ల సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి ఇచ్చే సంతోషం వెలకట్టలేనిది.

ఆఫీసులో పై అధికారి నుంచి సహోద్యోగుల దాకా ఇచ్చిన ప్రశంసల్ని ఇంట్లోనివారికి, సన్నిహితులకు చెప్పడం సెల్ఫ్ డబ్బాకాదు. ఆనందాన్ని ఇష్టమైనవారితో పంచుకునే ఇంకో మార్గంలో ఆనందాన్ని పొందినవారవుతారు. సంతోషకర స్మృతుల్ని, అనుభవాల్ని ఇతరులతో పంచుకుంటూ మళ్ళీ నెమరువేసుకోవాలి. ఆనందాన్ని పొడిగించుకోవడానికి ఇది అత్యంతశక్తివంతమైన సాధనం.

వెబ్దునియా పై చదవండి