శీతాకాలం: మహిళలూ... మానసిక ఉద్వేగాలతో జాగ్రత్త!

FILE
శీతాకాలంలో మానసిక ఉద్వేగాలు కొందరిలో ఎక్కువ ప్రభావం చూపుతాయి. వర్కింగ్‌ ఉమెన్‌కు ఇంటా బయట ఒత్తిళ్లు వెంటాడుతాయి. వీటిని ఎదుర్కొంటూ పనులు చక్క బెట్టుకోవాలి. మెదడులో ఉండే మెలటోన్‌ రిసెప్టర్లు చురుకుదనానికి మూలంగా నిలుస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవాలి.

చలికాలంలో ఇవి నిస్తేజంగా మారిపోతాయి. అటువంటప్పుడు మనుషులు మూడీగా మారిపోతారు. ఈలోగా చలి కారణంగా పనులు చేసుకొనేందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం సహకరించకపోయినా వాళ్ల మీద విరుచుకుపడే ఛాన్స్ ఉంటుంది. దీన్నే సీజనల్‌ మూడీ డిజార్డర్‌ అని చెబుతారు.

సమస్య మూలాల్ని గుర్తించి, దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఈ సమస్య ఊబిలో మరింత కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నలుగురిలో కలిసిపోతూ, ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని మానసిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి