ఐదు జ్ఞానేంద్రియాలే గుఱ్ఱాలు.. అవి మనిషిని?

శనివారం, 13 సెప్టెంబరు 2014 (16:28 IST)
ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథి విద్ధి మన: ప్రగ్రహమేవ చ|| (కఠోపనిషత్‌)
 
శరీరమే రథం. అందులో ఉండే రథస్వామి లేదా యజమాని జీవుడు. అతణ్ణి నడిపించే బుద్ధి సారథి. మనస్సే ప్రగ్రహం. అంటే పగ్గం. కన్ను, ముక్కు, చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలే గుఱ్ఱాలు. ఇవి తాము గ్రహించే విషయాలవైపు మనిషిని లాగుతుంటాయి. 
 
వాటిని అదుపులో పెట్టాల్సింది మనస్సు. విజ్ఞానవంతమైన బుద్ధి రథికుణ్ణి అతని గమ్యానికి చేరుస్తుంది. దీనినే మరోమంత్రంలో వివరిస్తూ అలాంటి విజ్ఞానసార్థి గల రథస్వామి పరమపదం అంటే పరమాత్మ తత్త్వాన్ని పొందుతాడని ఉపనిషత్తు చెబుతోంది. 

వెబ్దునియా పై చదవండి