భయానికి లోనైనప్పుడు... ఇలా దుర్గాదేవిని స్మరించండి.
శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:10 IST)
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.
అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించడమే కాదు, భయం కూడా నివారించబడుతుంది అందుచేత నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని రోజూ పూజించే వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
ముఖ్యంగా భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ... భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.