దక్షిణావర్త శంఖాన్ని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సోమవారం, 13 ఆగస్టు 2018 (12:16 IST)
లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భివించింది. కనుక శంఖం లక్ష్మీదేవి స్వరూపమని చెబుతుంటారు. లక్ష్మీ స్వరూపం కనుకనే శంఖం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనదని అంటారు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో పాటు శంఖాన్ని కూడా కలిగి ఉంటాడు. శంఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శ్రీమహావిష్ణువు ఉంటాడని చెప్పబడుతోంది.
 
శ్రీమహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి సిరిసంపదలను కురిపిస్తుంది. శంఖంలో పోసిన జలం తీర్ణమవుతుందని మహర్షులు చెబుతున్నారు. అలాంటి తీర్థంతో అభిషేకం చేయడం వలన విష్ణుమూర్తి ప్రీతి చెందుతారు. శంఖాన్ని చూడడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. శంఖంలోని తీర్థాన్ని తలపై చల్లుకోవడం వలన సమస్త నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది.
 
శంఖనాదం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దక్షిణావర్త శంఖాన్ని పూజా మందిరంలో ఉంచి పూజలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. దక్షిణావర్త శంఖాన్ని పూజించిన వారికి ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు