పరీక్షలొచ్చేశాయ్... పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకం
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:44 IST)
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఓం నమో భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా || అనే మంత్రాన్ని గురువారం పూట శ్రద్ధతో పఠించే వారికి లేదా ప్రతిరోజూ నిష్ఠతో పై మంత్రంతో గురు భగవానుడిని ధ్యానించే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అలాగే పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేయాలంటే ప్రయత్నంతో పాటు గురు భగవానుడికి సంబంధించిన పై శ్లోకాన్ని చదవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 11 సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పిల్లలే కాదు.. పెద్దలు కూడా దక్షిణామూర్తికి సంబంధించిన పై మంత్రాన్ని రోజూ పఠిస్తే.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.