అందుకే గృహస్థే గృహిణి వద్ద తొలి భిక్షకుడు

గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:03 IST)
అందుకే గృహస్థే గృహిణి వద్ద తొలి భిక్షకుడు. ఎందుకో తెలుసా? ఆ అన్నపూర్ణేశ్వరి కాశీనాధునికి వడ్డించింది. ఆ దేవి లేత ఎరపు పట్టుచీర కట్టుకుని, పూలజడతో ప్రకాశిస్తూ, కస్తూరిని ధరించి, ముత్యాల చెవికమ్ములు దాల్చి, సీమంతన సింధూరం సవరించి, చరణాల బంగారు పట్టీలు ధరించి, కటిపై వజ్రాల ఒడ్డాణం దాల్చి, కాశికా నగరాన, అన్నపూర్ణా, విశాలాక్షి పేరులతో ప్రకాశించే విశ్వనాథుని దేవేరి, ప్రతి మధ్యాహ్నవేళ అమృతపాయస దివ్యాన్నం పెడుతోంది. అంటూ శ్రీనాథులవారు అమ్మ రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చెబుతారు. 
 
అలాగే కాశీనాథునికి అన్నం వడ్డిస్తున్నట్లుగా అమ్మవారిని అభివర్ణిస్తుంటారు శాస్త్రకారులు. చెప్పాలంటే ప్రతి గృహిణి అన్నపూర్ణే. ప్రతి ఇల్లాలు అన్నం వండి కుటుంబ సభ్యుల కడుపులు నింపుతుంది. అందుకే గృహస్థే గృహిణి వద్ద తొలి భిక్షకుడు. అందువలన ప్రతీ శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవి ప్రార్థించిన అమ్మ అనుగ్రహం లభించి ఆ గృహంలో అన్నానికి లోటుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు