మనస్సును తేలిక పరిచే ప్రార్థన!

సోమవారం, 30 జూన్ 2014 (12:56 IST)
ప్రార్థన అంటే ప్రతి రోజూ ఉదయం సాయత్రం తమకు ఇష్టమైన దేవుని స్థుతించడం లేదా మంత్రాన్ని పఠించడంగా భావిస్తారు. ప్రార్థన అంటే అది కాదు. అలాగే, ప్రార్థన అనగానే ఒక మతపరమైన అంశంగా కూడా పరిగణించరాదు. ప్రార్థనలు మనస్సును తేలికపరిచే సాధనాలు. మనం ఎంత వద్దనున్నా ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటాం. 
 
వాస్తవానికి ప్రతి వ్యక్తి మనస్సును అనేక అంశాలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని అర్థం లేనివిగా ఉంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అటుంవంటివి వదిలించగలిగిన మరో మార్గం ఏదీ లేదు. దీనికి మానవశక్తిని మించిన మరో శక్తి తోడ్పాటు కావాల్సిందే. ఆ తోడ్పాటును అందించేవి ప్రార్థనలనిగ్రహించాలి. అయితే, ప్రార్థనలను విశ్వసించి అనుసరిస్తే మాత్రం తేడాను అతి సులభంగా అర్థం చేసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి