శనిదోష ప్రభావం అనేక ఇక్కట్లకు, ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. శనిదేవుడు ఇచ్చే ప్రతికూల ఫలితాలు నానాబాధలు పెడుతుంటాయి. శనిదోష ప్రభావం మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది. సమస్యల సుడిగుండంలో పడవేస్తుంది. అందువలనే శనిదేవుడిని శాంతింపజేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.
సాధారణంగా శనిదోష నివారణకి సంబంధించిన ప్రయత్నాలలో భాగంగా జపము, దానము, రత్నధారణ కనిపిస్తుంటాయి. కొన్ని జపాలు, దానాలు శనిదేవుడిని ప్రసన్నుడిని చేస్తుంటాయి. అలాగే రత్నధారణ కూడా ఆయన అనుగ్రహం అందేలా చేస్తుంది. ఒక్కోగ్రహ సంబంధమైన దోషం నుండి బయటపడడానికి ఒక్కో రత్నాన్ని ధరించవలసి ఉంటుంది.