సాధారణంగా కలలనేవి అందరికీ వస్తుంటాయి. ఆయా కోరికలను బట్టి ఆలోచనలను బట్టి అందుకు సంబంధించిన కలలు వస్తుంటాయి. ఇక అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కలలు ఫలితాలను ఇవ్వవని వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం జరుగుతుంటుంది.
కలలు వేరుగా వచ్చినట్టే వాటికి సంబంధించిన ఫలితాలు కూడా వేరుగానే ఉంటాయి. కొన్ని కలలు జరుగుతున్న సంఘటనను ప్రేక్షకులుగా చూస్తున్నట్టుగా వస్తుంటాయి. మరికొన్ని కలల్లో జరుగుతున్న దృశ్యంలో కల కనేవారు కూడా కనిపిస్తుంటారు. ఏదైనా మెలకువ వచ్చేంత వరకు అది కల అనే విషయం తెలియనంత సహజంగా ఉండడం కల గొప్పతనంగా చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో వివిధ రకాల పదార్థాలు, పండ్లు తింటున్నట్టుగా కూడా కలలు వస్తుంటాయి. అలా బెల్లం తింటున్నట్టుగా గాని, మామిడి పండ్లు తింటున్నట్టుగా గాని కల వస్తే ఎదురుచూస్తోన్న శుభసమయం దగ్గరికి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలని చెప్పబడుతోంది. ఇలా కలలో తాము బెల్లం, మామిడి పండ్లు తింటున్నట్టుగా కనిపించడం మనసులో గల కోరికలు త్వరలో నెరవేరతాయనే విషయాన్ని సూచిస్తాయని స్పష్టం చేయబడుతోంది.