మహాగణపతి సంకట నాశన గణేశ స్తోత్రాన్ని ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి. మనం ఏ కార్యం తలపెట్టినా విజయం వరిస్తుంది. సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠించాలి. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.