ప్రయాతి.. మద్భావంయాతి...

"అంతకాలేచ మా మేవ స్మర న్ముక్త్వా కలేవరమ్
యః ప్రయాతి స మద్భావంయాతి నాస్త్యత్రసంశయః"

పై మంత్రమును ఉచ్చరిస్తే మోక్షం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరణసమయమందు శ్రీకృష్ణభగవానుని స్మరిస్తూ ప్రాణాలు విడుస్తారో.., వారికి తప్పకుండా మోక్షము లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

పూర్వం భీష్మాచార్యులు కూడా అంపశయ్య మీద పడిన సమయంలో, విష్ణు స్వరూపుడిని సహస్ర నామాలతో స్తుతిస్తూ, తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీ కృష్ణుడిని సమక్షంలో పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందారని పండితులు అంటున్నారు.

అందుచేత ప్రతి నిత్యం పై శ్లోకమును పఠిస్తూ శ్రీ కృష్ణుడిని ప్రార్థించే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విధంగా శుక్రవారం పూట శుచిగా స్నానమాచరించి, సమీపంలోని వైష్ణవ ఆలయాన్ని సందర్శించుకునే వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయని పండితులు అంటున్నారు. అదే రోజున శ్రీహరికి తులసీమాలను సమర్పించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

వెబ్దునియా పై చదవండి