ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
శుభసమయం సమీపించింది. ఉత్సాహంగా అడుగులేయండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ముఖ్యుమైన పనులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఊహించని ఖర్చులెదురవుతాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. తొందరపాటు నిర్ణయాలు తగవు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రయాణం విరమించుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంక్పసిద్ధికి మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
సమర్థతను చాటుకుంటారు.. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. పిల్లల విజయం ఉత్సాహాన్నిస్తుంది. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
ప్రతికూలతలెదుర్కుంటారు. బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. విలువైన వస్తువులు జాగ్రత్త. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించి సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. మొండిగా పనులు పూర్తిచేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.