ఏటీఎం నుంచి శాలరీని విత్ డ్రా చేసేటప్పుడు..

మంగళవారం, 27 జనవరి 2015 (14:56 IST)
శాలరీ వచ్చిన రోజే మొత్తం ఖర్చు చేసేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఏటీఎం నుంచి శాలరీని విత్ డ్రా చేసేటప్పుడు ఆ నెలకు కావాల్సిన ముఖ్యమైన అవసరాల జాబితాను రూపొందించుకోవాలి. హోం లోన్స్ ఈఎంఐలతో పాటు ఇతర పెట్టుబడులేవైనా ఉంటే వాటిని కూడా ఆ జాబితాలో చేర్చాలి.
 
ఖర్చులు పోనూ కొంత డబ్బును మీ వద్ద అదనంగా ఉంచుకోండి. కనీసం రూ.500 అయినా అదనంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యతనివ్వండి. అదే సమయంలో మీ ఖర్చులకు కూడా ప్రాధాన్యతనివ్వండి. మార్కెట్ లోని ఆఫర్స్‌కు ఎక్కువగా టెంప్ట్ కాకుండా ప్రయత్నించండి.  
 
ఎక్కడికైనా వెళ్ళాలని మీరు ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. తద్వారా అప్పటికప్పుడు బుక్ చేసుకోవడంవల్ల పడే అదనపు ఖర్చును మిగుల్చుకున్నవారవుతారు. 

వెబ్దునియా పై చదవండి