ఆలోచనలతో బుర్ర వేడెక్కితే.. ఇలా చేయండి

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:31 IST)
ఆలోచనలతో బుర్ర వేడెక్కితే అదే పనిగా గంటల పాటు ఒకే చోట కూర్చోకండి. సమస్య పరిష్కారం కావాలంటే హ్యాపీగా నాలుగు అడుగులు వేయండి. ఆలోచన‌లు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెద‌డుకు కొత్త ఆలోచన రావాలంటే.. బయ‌ట‌కు వెళ్ల‌టం, న‌డ‌వ‌టం చేస్తే మెద‌డు తిరిగి ప‌దునెక్కుతుంద‌ని మానసిక నిపుణులు అంటున్నారు. సృజ‌నాత్మ‌కంగా ఆలోచించాలంటే అదే పనిగా ఆలోచ‌న‌ చేయకూడదని వారు సూచిస్తున్నారు.
 
బుర్రను వేడెక్కనీయకుండా చూస్తేనే.. అదే పనిగా ఆలోచించడాన్ని నిలిపేయాలి. మెదడు తేలిగ్గా ఉండే చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తూ ఉంటే మెద‌డు మ‌రింత చురుగ్గా త‌న ప‌ని తాను చేస్తుంది. అదే పనిగా ఆలోచిస్తూ వుంటే.. ఆలోచనలన్నింటిని పక్కనబెట్టి.. స్నానం, తోట‌ప‌ని లాంటివి చేస్తే.. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మెదడు ఆలోచనల ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇలానే చేయాలని.. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని మానసిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు