పిల్లలకు జలుబు చేస్తే ఇలా చేయండి.

మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:38 IST)
పిల్లలకు వర్షాకాలం జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. పిల్లలకు అనారోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను ఇవ్వడం చేయాలి. రోజులో మూడుసార్లు పిల్లలకు తేనెను ఇవ్వొచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద  నిపుణులు అంటున్నారు. 
 
జలుబు చేసి ముక్కు నుంచి నీరు కారుతుంటే.. పిల్లలకు ఎక్కువగా నీరు తాగించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు బయటకు పంపబడతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయి. అలాగే ఒక కప్పునీళ్లు తీసుకుని చిటికెడు ఓమ, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు