ఒత్తిడి నుంచి ఉపశమనానికి మార్గం క్షమాగుణం

బుధవారం, 27 మే 2015 (17:33 IST)
ఒత్తిడిని జయించాలంటే క్షమాగుణం అలవర్చుకోవాలి. మనపట్ల మనం కానీ, ఇతరుల పట్ల కానీ కఠినంగా వ్యవహరించకూడదు. సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించుకునేలా క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. ఎవరిపట్లనైనా కక్షగా ఉన్నట్టయితే అది మనస్సును చికాకుపరుస్తుంది.
 
 
అందువల్ల మనలోని ప్రతికూల భావాలను వెనక్కి నెట్టేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయాలంటే ఎదుటివారిపట్ల కలిగిన కోపాన్ని నియంత్రిచుకోగలగాలి. ఎపుడైతే క్షమాగుణాన్ని అలవర్చుకుంటారో అపుడు మనలోని ప్రతికూల శక్తి దానంతట అదే తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటి వరకు ఉన్న ఒత్తిడి ఒక్కసారి ఆవిరైపోతుంది.
 
ఇతరులను క్షమించడంతో పాటు గతాన్ని గతించాలేతప్పా.. దానికి ఆజ్యం పోయకూడదు. మనకు కలిగిన అనుభవాలసారం నుంచి ప్రతి రోజూ మంచి పాఠాల నేర్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చేసిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించాలి. స్వయం తప్పిదాలను విస్మరించి మరోమారు జరక్కుండా చూడాలే కానీ, నిందించుకుంటూ కూర్చోకూడదు. ఎందుకిలా జరిగిందన్న చింత, నిందలు, పదేపదే ప్రశ్నించుకోవడం మానేయాలి. అపుడే క్షమాగుణం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి