అసంతృప్తి ఒక మాయరోగం...

శుక్రవారం, 3 నవంబరు 2017 (14:41 IST)
సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు అసంతృప్తి కలిగిందో ఆ విషయం గురించి మనం ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే మనకి ఉన్నదానికన్నా లేనివాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని గుర్తించాలి. పైగా, మనకంటే బాగా ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పలేం. అందువల్లే అసంతృప్తి ఒక మాయరోగం వంటిందని కవి పోతన అన్నారు. పైగా, అసంతృప్తిపై ఆయన ఒక పద్యం కూడా రాశారు. 
 
"వ్యాప్తిన్ చెందక వగవక ప్రాప్తించిన లేశమైన 
పదివేలనుచున్ తృప్తిన్ చెందని మనుజుడు
సప్తద్వీపములనైన చక్కన్ బడునే" 
 
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను అడిగితే వందలో 99 శాతం మంది బాగున్నాం అని చెప్పరు. ఇంకా ఏదో కావాలి అని చూస్తూనే ఉంటారు. పైగా నసుగుతుంటారు. నాకేం బ్రహ్మాండంగా ఉన్నాం అనే మాట వారి నుంచి వినిపించదు. లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నా వారిలో ఇంకా అసంతృప్తి దాగివుందని తెలుసుకోవచ్చు. అందుకే అసంతృప్తి ఓ మాయరోగంగా మన పెద్దలు పేర్కొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు