ఓ వైపు ఎండ-ఓ వైపు వెన్నెల: పుట్టపర్తిలో అద్భుతం!

FILE
పుట్టపర్తిలో మహాద్భుతం ఆవిష్కృతమైంది. కలియుగదైవం సత్యసాయి అంత్యక్రియల సందర్భంగా ఈ అద్భుతం కనువిందు చేసింది. ఒకవైపు సత్యసాయి మహా సమాధి కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు సూర్యచంద్రులు దర్శనమిచ్చారు.

బాబా పార్థివ దేహానికి కుల్వంత్ హాలులో బాబా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాబా పార్థివదేహానికి రత్నాకర్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. బాబా మహా సమాధి కార్యక్రమాలు జరుగుతుండగా, పుట్టపర్తిలో పట్టపగలే వెన్నెల కనిపించింది. ఒకవైపు మండుటెండ మరో వైపు వెన్నెలతో కనిపించిన ఈ సూర్యచంద్రులను చూసి కోట్లాది మంది భక్తులు పరవశించి పోయారు.

మండుటెండలో బాబా వారి సమాధి కార్యక్రమాన్ని వీక్షించేందుకు సూర్య చంద్రులు సైతం ఆకాశంలోకి వచ్చాయా అని అనుకునేలా చేశాయి. కుల్వంత్ హాలులో ఆసీనులైన అతిరథ మహారథులు సైతం ఈ అద్భుత ఘట్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బాబా నోట్లో నవరత్నాలు, సమాధిలో సుగంధ ద్రవ్యాలు, విభూది వేసి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి