ఘనంగా సత్యసాయి 83వ జన్మదిన వేడుకలు

సత్యసాయిబాబా 83వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కల్వంత్ దర్శన హాలులో ఈ వేడుకలు వైభవంగా జరుగాయి. ఉదయం ఏడు గంటలకు విద్యార్థులు స్వాగతం పలుకుతుండగా, సత్యసాయి దర్శన హాలుకు చేరుకుని ప్రత్యేక దర్శనం ఇచ్చారు.

అనంతరం జన్మదిన కేక్‌ను సత్యసాయి కట్ చేశారు. ఈ వేడుకలను తిలకించడానికి దేశ, విదేశాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బాబా జన్మదిన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి