బాబా ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగాను: గీతారెడ్డి

WD
శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతోనే రాజకీయ, నిజజీవితంలో ఈ స్థాయికి ఎదిగానని మంత్రి గీతారెడ్డి అన్నారు. సత్యసాయి బాబా తనకు మార్గదర్శి అని.. ఆయన ఆధ్యాత్మిక ప్రబోధనలు జీవితంలో సుఖసంతోషాలకు, పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు.

సత్యసాయి బాబా సందేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని గీతారెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మంత్రిగా కాకుండా సాధారణ భక్తురాలిగా బాబా సన్నిధిలో గడపడమే అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వెల్లడించారు.

సత్యసాయి బాబా 85వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో గీతారెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యక్రమాలను నిర్వాహకురాలు చేతనారాజు వివరించారు.
WD


అనంతరం ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్యరూప ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన సత్యసాయి బాలవికాస్ విద్యార్థులు ప్రదర్శించిన మహిషాసురమర్దిని నృత్యరూపకానికి శ్రీమతి రఘునాథన్ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది సాయి భక్తులు పాల్గొన్నారు.

కాగా.. నవంబర్ 23 (మంగళవారం) వరకు జరిగే శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు, భక్తులు పుట్టపర్తిని సందర్శంచుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి