సమస్త లోకా సుఖినో భవంతు: బాబా

పరమ పావనమైన భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, సత్యం, ధర్మం రెండింటిని ప్రేమ, శాంతి వెన్నంటి ఉంటాయని సత్యసాయి బాబు పేర్కొన్నారు. సమస్త లోకాలు సుఖంగా ఉండాలని సత్యసాయి బాబా ఈ సందర్భంగా దీవించారు. రాబోయే 28 ఏళ్లలో ప్రపంచంలో భారత దేశం మానవతా విలువలతో కూడిన అగ్రరాజ్యంగా నిలుస్తుందని, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, మానవతా విలువలకు మనదేశంలో చోటుందని బాబు అన్నారు.

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాలులో శనివారం జరిగిన సత్యసాయి విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో బాబా పైవిధంగా ఉప న్యసించారు. విదేశాల్లో చదివిన వారు మన దేశ, సంస్కృతి, ఆచార వ్యవహారాలను విస్మరించడంపై బాబా ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశాలకు పిల్లలను పంపటం ద్వారా దుర్భుద్ధి, దురుద్దేశాలు అలవరచుకుంటారని సత్యసాయి వెల్లడించారు. మనదేశంలో భాగ్యం ఎంత వెతికినా విదేశాల్లో దొరకదని, తనకూ అందరూ ప్రేమికులేనని, అందరినీ ప్రేమిస్తానని బాబా తెలిపారు. రాజకీయాల్లో మనకు ఏ పార్టీ వద్దని, మన పార్టీ ప్రేమ పార్టీ అని బాబా ఉద్ఘాటించారు. మనిషిపై మనిషికి నమ్మకం ఉండాలని, అప్పుడే ఆత్మసంతృప్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన ప్రబోధించారు.

వెబ్దునియా పై చదవండి