మరణించాక యమలోకానికి చేరుకోవడానికి 47 రోజులు పడుతుందట!

శనివారం, 16 జులై 2016 (11:43 IST)
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అలాగే చనిపోయిన మనిషి స్వర్గానికో నరకానికో పోకా తప్పదు. కాని అందరికీ తెలియని విషయం ఏమిటంటే... చనిపోయిన మనిషి జెట్ వేగంతో యమలోకానికి వెళ్తారని అందరూ అనుకుంటారు. మరణించిన వ్యక్తి మంచివాడయితే స్వర్గానికి వెళ్తారని, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారని  హిందూ పురాణాలు చెబుతున్నాయి. 
 
ప్రతి ఒక్కరి తలరాత, వారు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా నిర్ణయించేది యమరాజు. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది ఆయనే నిర్ణయిస్తారు. ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది ? అసలు మరణం తర్వాత యమలోకానికి వెళ్లే మార్గం గురించి గరుడ పురాణం చెప్పే విషయాలని ఓసారి  పరిశీలిద్దాం...
 
చనిపోయిన తర్వాత యమలోకానికి చేరుకోవడానికి 47 రోజుల ప్రయాణం పడుతుందట. చనిపోయిన వ్యక్తి చెడు పనులు హత్యలు, అక్రమాలు, దొంగతనాలు వంటి నేరాలు చేస్తే డైరెక్టుగా నరకానికి వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చనిపోవడానికి కొంత సమయం ముందు నుంచి ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా..మాట్లాడలేకపోతాడు. నోరు మూగబోతుంది. తను ఈ లోకంలో జీవించిన జీవితాన్నంతటినీ ఒక్కసారి చూడగలుగుతాడు.
 
జీవితపు చివరి క్షణాల్లో అతనిలో దివ్యదృష్టి తెరుచుకుని.. ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకోగలుగుతారట.  శరీరంలో ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుందట. తనను యమలోకానికి తీసుకెళ్లడానికి యమరాజు పంపిన యమదూతలను మాత్రమే అతని కళ్లకి కనిపిస్తాడట. యమదూతల భయంకర రూపం చూసి.. నోరు కూడా తడారిపోతుందట. యమదూతలను చూసిన వెంటనే చనిపోయిన వ్యక్తి చాలా భయానికి గురై మూత్రం, లేదా మలవిసర్జన చేస్తారని పురాణంలో చెప్పబడుతోంది.
 
యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరట. యమలోకానికి వెళతున్న ప్రయాణాలలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారట. మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలను అతి కిరాతకంగా కొరడాతో హింసిస్తారట.
 
దేవుడిని పూజించని వాళ్లకు, ఇతరుల తప్పులను క్షమించని వాళ్లకు స్వర్గానికి వెళ్లడానికి యమరాజు అనుమతించడట. యమలోకానికి చేరిన వెంటనే యమరాజు.. ఒకసారి.. ఆత్మను వాళ్లు చనిపోయిన స్థలానికి పంపిస్తారు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా ? లేదా ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకు పంపుతాడు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటుందట. ఇదీ సంగతి...!

వెబ్దునియా పై చదవండి