వేదాంగాలలో ఆరోదాన్ని గురించి వివరిస్తే?

మంగళవారం, 19 ఆగస్టు 2014 (17:25 IST)
వేదాంగాలలో చివరిది జ్యోతిష్యము. వేదాన్ని అనుసరించి మనం చేసే యజ్ఞ, యాగాదికాలు ఉంటాయి. వాటిని ప్రారంభిచడానికి, నిర్వహించడానికి తగిన సమయాలు ఉంటాయి. ఇంటువంటి తగిన సమయాన్ని శుభ సమయం లేదా ముహుర్తం అంటారు. 
 
ఈ ముహుర్తాలను అనుసరించి, వైదిక కార్యాకలాపాలు చేస్తుంటారు. శుభ సమయాలు సౌర కుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాల గమనం మీద ఆధారపడివుంటాయి. నక్షత్ర, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి వివరించే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం. ఇది లేకుండా వేద కార్యకలాపాలు ఆచరించడం అసాధ్యం. 

వెబ్దునియా పై చదవండి