రుద్రాక్షలను రాత్రిపూట ధరించవచ్చా? (video)

శనివారం, 18 నవంబరు 2017 (17:49 IST)
రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి. వాటిని ధరించడం ద్వారా సాత్త్విక గుణాన్ని పొందవచ్చు. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లైనాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్షలు సుబ్రహ్మణ్య స్వరూపమని భక్తుల విశ్వాసం.
 
ఇక సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా సిద్ధం చేసుకోవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. కానీ రాత్రిపూట నిద్రించేటప్పుడు రుద్రాక్షను ధరించకూడదు.
 
రాత్రిపూట వాటిని తీసి భగవంతుని పాదాల వద్ద వుంచి.. పొద్దున స్నానం చేశాక వాటిని ధరించడం చేయాలి. రుద్రాక్ష ధరిస్తే.. మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలుగా మారిపోతాయని, శివునికి రుద్రాభిషేకం చేస్తే సకల సంపదలను పొందవచ్చును. దీర్ఘవ్యాధులు తొలగిపోయేందుకు, కోరిక కోరికలు నెరవేరేందుకు రుద్రాభిషేకం చేస్తారు. తిథి ప్రకారం రుద్రాభిషేకం చేయించాలి. 
 
ఏడు-పదునాలుగు తిథులలో పూజ తగదు. పండితులను సంప్రదించి వివరాలను తెలుసుకున్నాకే అభిషేకం చేయించాలి. రుద్రాక్షలు ధరించిన భక్తుడు మద్యమును, మాంసమును, వెల్లుల్లిని, నీరుల్లిని, మునగకూరను, పంది మాంసాన్ని తీసుకోరాదు. రుద్రాక్షను చూసినా, స్పృశించినా, మాలతో జపము చేసినా పాపాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు