ఊసరవెల్లిని కలలో చూసినట్లైతే..?

గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:37 IST)
ఈగలను చంపినట్లు కల వచ్చినట్లైతే మిక్కిలి మంచిది. ఈగలు నోటిలోకి వెళ్లినట్లు కల వచ్చినచో దుష్టులతో స్నేహము కలుగును. ఉడతను చూసినట్లు కల వచ్చినచో శత్రువులను అగౌరవము తప్పదు. వ్యాపారము చేసేవారి కలలో ఉడుత వచ్చినట్లైతే విజయము, ధనలాభము కలుగును.

కోర్టు వ్యవహారములలో మాత్రము అపజయము కలుగును. ఊసరవెల్లిని చూసినట్లు కల వచ్చినచో దుర్మార్గుల వలనగానీ, విరోధుల వలనగాని ఆపదలు కలుగును. కనుక వారికి దూరంగా ఉండవలయును.
 
ఎలుగుబంటి చర్మము చూసినట్లు కల వచ్చినచో కష్టములు చిక్కులు కలుగును. ఎలుగుబంటి చర్మము చూసినట్లు కల వచ్చినట్లైతే బాధలు కలిగినా.. చివరకు ఆనందము కలుగును. 

వెబ్దునియా పై చదవండి