ఒక ముద్ద ఆహారాన్ని 24 సార్లు నమలాలి: సద్గురు

శుక్రవారం, 24 నవంబరు 2017 (14:35 IST)
యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. తీసుకునే ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపొతే అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొండితనాన్ని సృష్టించదు. ఒక ముద్ద ఆహారాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహారపు సమాచారం మీ శారీరిక వ్యవస్థలో స్థాపితమవుతుంది. 
 
అప్పుడు మీ శరీరంలోని ప్రతీ కణం మీకు ఏది సరైనదో, ఏది సరైనది కాదో నిర్ణయించడం మొదలుపెడుతుంది– అంటే కేవలం నాలుక విషయంలోనే కాదు, మొత్తం వ్యవస్థ విషయంలో ఇలా జరుగుతుంది. మీరిది కొంత కాలం పాటూ చేస్తే, మీ శరీరంలోని ప్రతీ కణానికి దానికేది ఇష్టమో, అయిష్టమో అన్న విషయంపై అవాగాహన ఏర్పడుతుంది.
 
భోజనం చేసేటప్పుడు నీళ్ళను తీసుకోకపోవటం కూడా మంచిది. భోంచేయడానికి కొద్ది నిమిషాల ముందో లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాతో కొద్దిగా నీళ్ళు తీసుకోవడం మంచిది. రాత్రి వేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తివంతం చేస్తుంది. ఆ నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.'' సద్గురు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు