మంగళవారం రోజున స్త్రీలు ఆచరించాల్సిన పూజ ఏమిటంటే?

సోమవారం, 1 అక్టోబరు 2018 (14:45 IST)
మంగళవారం కుమారస్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని పటాలను పసుపు, కుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి.
 
ఆ తరువాత దీపారాధన చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ నాడు పూజలు చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది. అలాగే ఆలయాలకు వెళ్ళి కుమారస్వామివారిని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన బాధలు, దారిద్య్రాలు తొలగిపోయి సిరిసంపదలు చేకూరుతాయి. 
 
ఈ రోజున ఎరుపు రంగు దుస్తులకు ధరించి ఆలయాలకు వెళితే మంచిది. అలానే స్త్రీలు ఎరుపురంగు పువ్వులు, గులాబీ పువ్వులు పెట్టుకుంటే దీర్ఘసుమంగళీగా ఉంటారని పురాణాలలో చెప్పబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు