వినాయకుడి బొమ్మ వాస్తు దోషాలను దూరం చేస్తుంది. ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అదే కార్యాలయాల్లో నిలబడి వుండే వినాయకుని విగ్రహాన్ని వుంచాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్‌లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. అలాగే కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వుంచితే అదృష్టం వరిస్తుంది. విజయం మీ సొంతం అవుతుంది. ఇంకా సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.