ప్రస్తుతం ఆ అధికారం ప్రభుత్వానిదే. సర్కారు ఆధీనంలోని భాండాగారాన్ని 1978లో తెరిచారు. అప్పుడు ఖజానాలో సంపద లెక్కించారు. కానీ ఆ లెక్కల వివరాలు అందుబాటులో లేవు. ఇంకా జగన్నాథ ఆలయ భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని ఒకేసారి వినియోగిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. వీటిలో ఒకటి పూరీరాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి ఆలయ సెక్యూరిటీ దగ్గర పెట్టారు. మూడో తాళం చెవి ఆలయ పాలనాధికారి దగ్గర ఉంటుంది.
తన దగ్గర భాండాగారం మొదట గదికి సంబంధించి ఒక తాళం చెవి మాత్రమే ఉందని తెలిపారు. 1960 నుంచి ప్రధాన ద్వారం తాళం చెవి బాధ్యత శ్రీక్షేత్ర పాలనాధికారి, కలెక్టర్‌కే ప్రభుత్వం పరిమితం చేసిందని గుర్తు చేశారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ట్రెజరీ తాళం చెవులు అనుమానాస్పద రీతిలో మాయమైన సంగతి తెలుసుకున్న భక్తులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు.