పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తారు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఆపదలో ఉన్నవాళ్లు ఆ స్వామిని మనస్సులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది.