శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలు కాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.