ధనుర్మాసం ఆరంభం నుంచి తెలుగు వాకిళ్లు ముగ్గులతో ముచ్చటగొలుపుతాయి. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంటాయి. అయితే సంక్రాంతి ముగ్గులో ఎన్నో అర్థాలు... అంతరార్థాలు ఉన్నాయి. ఇంటి ముందు పేడతో కలిపిని నీళ్లు చల్లిన వాకిలి మేఘాలు లేకుండా స్వచ్చంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్ర వచనం.