రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఇంట్లో అంతా ధూపం ఇవ్వాలి. రోజూ పూజ తరువాత కర్పూర హారతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది. ఇంట్లో ధన నష్టం జరగదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గుల్ పెట్టాలి. దీని సువాసన వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో మానసిక రోగులు ఉంటే వారికి నయం అవుతుంది. గుగ్గుల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది.
గోవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను కాల్చి దానిమీద పసుపు రంగు ఆవాలు వేసి ధూపం ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఉండి, డబ్బులు నిలవకపోతే అగర్‌బత్తీ ధూపం ఇవ్వాలి. కాళీ మాత ముందు అగర్‌బత్తీ వేయాలి. ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసి అగర్‌బత్తీతో వెలిగించాలి. ఇలా చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. వేపాకుతో ధూపం వేస్తే చాలా మంచిది.. వాస్తు దోషాలు తొలగిపోతాయి.